Red Hat Enterprise Linux 5.4

విడుదల నోడ్స్‍

అన్ని ఆకృతులకు విడుదల నోడ్స్‍.

Red Hat ఇంజినీరింగ్ కాంటెంట్ సర్వీసులు

Legal Notice

Copyright © 2009 Red Hat, Inc.. This material may only be distributed subject to the terms and conditions set forth in the Open Publication License, V1.0 or later (the latest version of the OPL is presently available at http://www.opencontent.org/openpub/).
Red Hat and the Red Hat "Shadow Man" logo are registered trademarks of Red Hat, Inc. in the United States and other countries.
All other trademarks referenced herein are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
PO Box 13588 Research Triangle ParkNC 27709 USA

Abstract
1 జులై 2009
ఈ పత్రము Red Hat Enterprise Linux 5.4 కొరకు విడుదల నోడ్స్‍‌ను వివరిస్తుంది.

1. వర్చ్యులైజేషన్ నవీకరణలు
2. క్లస్టరింగ్ నవీకరణలు
2.1. ఫెన్సింగ్ మెరుగుదలలు
3. నెట్వర్కింగ్ నవీకరణలు
4. దస్త్రవ్యవస్థల నవీకరణలు
5. డెస్కుటాప్ నవీకరణలు
5.1. అడ్వాన్సుడ్ లైనక్స్ సౌండ్ ఆర్కిటెక్చర్
5.2. గ్రాఫిక్స్ డ్రైవర్లు
5.3. లాప్‌టాప్ మద్దతు
6. సాధనముల నవీకరణలు
7. ఆకృతిని అనుసరించి మద్దతు
7.1. i386
7.2. x86_64
7.3. PPC
7.4. s390
8. కెర్నల్ నవీకరణలు
8.1. సాధారణ కెర్నల్ సౌలభ్యపు మద్దతు
8.2. సాధారణ ప్లాట్‌ఫాం మద్దతు
8.3. డ్రైవర్ నవీకరణలు
9. సాంకేతిక పరిదృశ్యములు
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర
ఈ పత్రము Red Hat Enterprise Linux 5.4 (kernel-2.6.18-154.EL) కుటుంబానికి చెందిన విడుదల నోట్సును కలిగివుంది:
  • Red Hat Enterprise Linux 5 Advanced Platform for x86, AMD64/Intel® 64, Itanium Processor Family, System p మరియు System z
  • Red Hat Enterprise Linux 5 Server for x86, AMD64/Intel® 64, Itanium Processor Family, System p and System z
  • Red Hat Enterprise Linux 5 Desktop for x86 మరియు AMD64/Intel®
ఈ విడుదల నోట్సు Red Hat Enterprise Linux 5.4 నందు అభివుద్దిపరచిన మెరుగుదలలు మరియు చేర్పుల యొక్కఅత్యధిక సేకరణను అందిస్తుంది.

Note

Red Hat Enterprise Linux 5.4 కొరకు విడుదల పత్రికీకరణ యొక్క రూపము మార్చబడింది. విడుదల నోట్సు యిప్పుడు ముఖ్య సౌలభ్యపు నవీకరణల వుపరితలదర్శనము, బగ్‌పరిష్కారములు మరియు సాంకేతిక పరిదృశ్యాలను కలిగివుంటుంది. కొత్త సాంకేతిక నోట్సు పత్రము వివరములు అన్ని నవీకరించిన ప్యాకేజీలు, తెలిసిన విషయములు మరియు సాంకేతిక పరిదృశ్యములు.

1. వర్చ్యులైజేషన్ నవీకరణలు

x86_64 ఆధార ఆకృతీకరణలపై Red Hat Enterprise Linux 5.4 యిప్పుడు పూర్తి మద్దతును కెర్నల్-ఆధారిత వర్చ్యువల్ మిషన్ (KVM) హైపర్విజర్ కొరకు చేర్చుతోంది.. KVMఅనునది లైనక్సు కెర్నల్‌నందు చేర్చబడింది, వర్చ్యువలైజేషన్ ప్లాట్‌ఫాంను అందిస్తుంది అది స్థిరత్వం యొక్క ప్రయోజనాన్ని తీసుకొంటుంది. మరియు Red Hat Enterprise Linux నందు హార్డువేరు మద్దతు గలది. KVM హైపర్విజర్‌ను వుపయోగించే వర్చ్యువలైజేషన్ చాలా గెస్టు ఆపరేటింగ్ సిస్టమ్సుపై మద్దతిస్తుంది:
  • Red Hat Enterprise Linux 3
  • Red Hat Enterprise Linux 4
  • Red Hat Enterprise Linux 5
  • Windows XP
  • Windows Server 2003
  • Windows Server 2008

Important

Xen ఆధారిత వర్చ్యువలైజేషన్ పూర్తి మద్దతిచ్చునటువంటిది. ఏమైనప్పటికి, Xen-ఆధారిత వర్చ్యువలైజేషన్‌కుభిన్నమైన కెర్నల్ వర్షన్ అవసరము. KVM హైపర్విజర్ సాదారణ (non-Xen) కెర్నల్‌తో మాత్రమే వుపయోగించబడుతుంది.

Warning

Xen మరియు KVM వొకే సిస్టమ్ నందు సంస్థాపించవచ్చును, వీటికి అప్రమేయ నెట్వర్కింగ్ ఆకృతీకరణ వేరుగా వుంటుంది. వినియోగదారులు వొక సిస్టమ్ పైన వొక హైపర్విజర్ మాత్రమే సంస్థాపించమని గట్టిగా మద్దతివ్వబడుతుంది.

Note

Red Hat Enterprise Linuxతో వచ్చేటటువంటి అప్రమేయ హైపర్విజర్ Xen. Xen హైపర్‌విజర్‌తో వుపయోగించుటకు అన్ని అప్రమేయ ఆకృతీకరణలు పరిశీలించబడినవి కావున. సిస్టమ్‌ను KVM కొరకు ఆకృతీకరించుటపై వివరములకొరకు, దయచేసి వర్చ్యులైజేషన్ మార్గదర్శిని చూడండి.
KVM వుపయోగించే వర్చ్యులైజేషన్ 32-bit మరియు 64-bit వర్షన్ల ఆపరేటింగ్ సిస్టమ్సును సవరించుకుండానే నడుపుటకు అనుమతిస్తుంది. విస్తరిత I/O పనితనము కొరకు పారావర్చ్యులైజ్డు డిస్కు మరియు నెట్వర్కు డ్రైవర్సు కూడా Red Hat Enterprise Linux 5.4 నందు చేర్చబడినవి. అన్ని libvirt ఆధారిత సాధనములు (అంటే virsh, virt-install మరియు virt-manager) కూడా KVM కొరకు మద్దతిచ్చుటకు నవీకరించబడినవి.
5.4 విడుదల కొరకు KVM హైపర్విజర్‌తో USB passthrough అనునది సాంకేతిక పరిదృశ్యంలా పరిగణించబడింది.
వివిధ సమస్యల పరిష్కారముతో: దాయుము/తిరిగివుంచు, లైవ్ మైగ్రేషన్ మరియు కోర్ డంప్స్, x86_84 హోస్టులపై Xen ఆధారిత 32 bit పారావర్చ్యులైజ్డు గెస్టులు యికపై సాంకేతిక పరిదృశ్యంలా విభజించబడివుండవు, మరియు Red Hat Enterprise Linux 5.4పై పూర్తిగా మద్దతించబడుతాయి.
etherboot ప్యాకేజీ ఈ నవీకరణనందు జతచేయబడింది,ప్రిబూట్ యెగ్జిక్యూషన్ యెన్విరాన్మెంట్ (PXE) వుపయోగించి గెస్టు వర్చ్యువల్ మిషన్‌ను బుట్ చేయగల సామర్ధ్యాన్ని అందిస్తోంది. OS లోడవ్వుటకు ముందుగా ఈ ప్రోసెస్ అవసరము మరియు కొన్ని సార్లు OS అది PXE ద్వారా బూట్ అవుతున్నానని దానికి తెలియదు అటువంటప్పుడు. KVM నందు వుపయోగించుటకు ఈథర్‌బూట్ కొరకు మద్దతు పరిమితం.
qemu-kvm ఆధారిత వర్చ్యువల్ మిషన్లనందు spice protocol నిభందనను మద్దతించుటకు qspice ప్యాకేజీలు Red Hat Enterprise Linux 5.4కు జతచేయబడినవి. qspice అనునది క్లైంట్, సర్వర్ మరియు వెబ్ బ్రౌజర్ ప్లగ్‌యిన్ కాంపోనెంట్లను కలిగివుంటుంది. ఏమైనప్పటికి, qspice-libs package నందలి qspice సేవిక పూర్తిగా మద్దతిచ్చునది. qspice క్లైండ్ (qspice ప్యాకేజీ ద్వారా అందించబడిన) qspice mozilla ప్లగ్‌యిన్ (qspice-mozilla ప్యాకేజీద్వారా అందించబడిన) రెండూ సాంకేతిక పరిదృశ్యంలా చేర్చబడినవి. qspice-libs ప్యాకేజీ సేవిక అభివృద్దిని కలిగివుంది. అది qemu-kvm తో వుపయోగించబడుతుంది మరియు పూర్తిగా మద్దతివ్వబడుతుంది. ఏమైనప్పటికి, Red Hat Enterprise Linux 5.4 నందు spice నిభందన కొరకు libvirt మద్దతు లేదు; Red Hat Enterprise Linux 5.4 నందు spiceను వినియోగించాలంటే Red Hat Enterprise వర్చ్యులైజేషన్ వుత్పత్తితో మాత్రమే సాద్యము.

2. క్లస్టరింగ్ నవీకరణలు

సంక్లిష్టమైన వుత్పత్తి సేవల నమ్మికను, విస్తృతిని, మరియు అందుబాటును వృద్దిపరచు వుద్దేశ్యంతో పనిచేసే బహుళ కంప్యూటర్లే (నోడ్లు) క్లస్టర్సు.
Red Hat Enterprise Linux 5.4 నందలి అన్ని నవీకరణలు సాంకేతిక నోట్సునందు వివరించబడినవి. Red Hat Enterprise Linux నందు క్లస్టరింగు కొరకు యింకా సమాచారము క్లస్టర్ సూటు వుపదర్శనంనందు మరియు క్లస్టర్ నిర్వహణ పత్రములనందు అందుబాటులోవుంది.
స్వయంచాలక హైపర్విజర్ గుర్తింపును మద్దతిచ్చుటకు క్లస్టర్ సూటు సాధనములు నవీకరించబడినవి. ఏమైనప్పటికి, క్లస్టర్ సూటును KVM హైపర్విజర్‌తో కూడి నడుపుట సాంకేతిక పరిదృశ్యంగానే పరిగణించడమైనది.
OpenAIS యిప్పడు మల్టీకాస్ట్ కు అదనంగా బ్రాడ్‌కాస్ట్ నెట్వర్కు సంప్రదింపును అందిస్తోంది. OpenAIS యొక్క స్టాండెలోన్ వుపయోగమునకు మరియు కస్టర్ సూటుతో వుపయోగమునకు ఈ కార్యక్రమత సాంకేతిక పరిదృశ్యంగా పరిగణించడమైనది. గమనిక, ఏమైనప్పటికి, బ్రాడ్‌కాస్టు కొరకు వుపయోగించుటకు OpenAISను ఆకృతీకరించు కార్యక్రమత క్లస్టర్ నిర్వహణ సాధనములనందు కలుపలేదు మరియు తప్పక మానవీయంగా ఆకృతీకరించాలి.

Note

SELinux ఎన్ఫోర్సింగ్ రీతి క్లస్టర్ సూటుతో మద్దతివ్వబడదు; అనుమతిగల లేదా అచేతనమైన రీతులు తప్పక వాడాలి. క్లస్టర్ సూటును బేర్ మెటల్ PPC సిస్టమ్సునందు వుపయోగించుట మద్దతివ్వబడదు. గెస్టులు క్లస్టర్ సూటును VMWare ESX హోస్టులనందు నడుపుట మరియు fence_vmwareను వుపయోగించుట సాంకేతిక పరిదృశ్యంగా పరిగణించడమైనది. వర్చ్యువల్ సెంటర్ చేత నిర్వహించబడు VMWare ESX హోస్టులపై క్లస్టరు సూటును గెస్టులనందు నడుపుట మద్దతించుటలేదు.
క్లస్టర్ సూటును వుపయోగించే మిశ్రమ ఆకృతి క్లస్టర్సు మద్దతివ్వబడుటలేదు. క్లస్టర్ నందలి అన్ని నోడులు వొకే ఆకృతివి అయివుండాలి. క్లస్టర్ సూటు ప్రయోజనాల రీత్యా, x86_64, x86 మరియు ia64లు వొకే ఆకృతి గలవిగా పరిగణించబడినవి, అందువలన వీటి సంయోజనంతో క్లస్టర్‌ను నడుపుట మద్దతించబడుతుంది.

2.1. ఫెన్సింగ్ మెరుగుదలలు

ఫెన్సింగ్ అనగా నోడును క్లస్టర్ యొక్క భాగస్వామ్య నిల్వనుండి అననుసంధానించుట. ఫెన్సింగ్ I/Oను భాగస్వామ్య నిల్వనుండి తెంచివేస్తుంది, అలా డాటా యధార్ధతను వుంచుతుంది.
Red Hat Enterprise Linux 5.4 నందు, హార్డువేరు మేనేజ్‌మెంట్ కన్సోల్ (HMC) వుపయోగించి నిర్వహించు IBM లాజికల్ పార్టీషన్ (LPAR) ఇన్‌స్టాన్సెస్ కొరకు, పవర్ సిస్టమ్సుపై ఫెన్సింగ్ మద్దతు, సాంకేతిక పరిదృశ్యంలా జతచేయబడింది. (BZ#485700). ఫెన్సింగ్ మద్దతు, సాంకేతిక పరిదృశ్యంలా Cisco MDS 9124 & Cisco MDS 9134 మల్టీలేయర్ ఫాబ్రిక్ స్విచ్‌లకు కూడా జతచేయబడింది (BZ#480836).
Red Hat Enterprise Linux యొక్క ఈ విడుదలనందలి fence_virsh ఫెన్సు ఏజెంట్ సాంకేతిక పరిదృశ్యంలా అందివ్వబడింది. fence_virsh అనునది వొక వినియోగదారికి (domU వలె నడుచుచున్న) మరియొక libvirt నిభందనను ఫెన్సు చేయగలగు సామర్ధ్యమును యిస్తుంది. ఏమైనప్పటికి, fence_virsh క్లస్టర్ సూటుతో సంయోగం కాలేదుగనుక ఆ యెన్విరాన్మెంటునందు అది ఫెన్సు ఏజెంటువలె మద్దతునీయదు.
అదనంగా, Red Hat నాలెడ్జు బేస్‌నందు, ఫైన్సింగ్‌పై ఈ క్రింది కొత్త ప్రకరణములు ప్రచురించబడినవి:
  • Red Hat Enterprise Linux 5 ఆధునిక ప్లాట్‌ఫాం క్లస్టర్ సూటుతో SCSI ఫెన్సింగ్ (నిరంతర నిల్వలు(పర్సిస్టెంట్ రిజర్వేషన్స్ )): http://kbase.redhat.com/faq/docs/DOC-17784
  • Red Hat Enterprise Linux 5 ఆధునిక ప్లాట్‌ఫాం క్లస్టర్ సూటుతో fence_vmware ఉపయోగించుట: http://kbase.redhat.com/faq/docs/DOC-17345

3. నెట్వర్కింగ్ నవీకరణలు

ఈ నవీకరణతో, జనరిక్ రిసీవ్ ఆఫ్‌లోడ్ (GRO) మద్దతు కెర్నల్ మరియు యూజర్‌స్పేస్ అనువర్తనము రెంటినందు అభివుద్దిపరచబడింది, ethtool.((BZ#499347)) సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ (CPU) ద్వారా జరుగు ప్రోసెసింగ్ తగ్గించుటద్వారా GRO సిస్టమ్ యిన్బౌండ్ నెట్వర్కు అనుసంధానముల పనితనమును పెంచుతుంది. GRO అదే సాంకేతికతను లార్జ్ రిసీవ్ ఆఫ్‌లోడ్ (LRO) సిస్టమ్‌వలె అభివృద్ది పరస్తుంది, అయితే పెద్ద విస్తృతిలో ట్రాన్సుపోర్టు లేయర్ నిభందనలకు ఆపాదించబడుతుంది. GRO మద్దతు చాలా నెట్వర్కు పరికర డ్రైవర్లకు కూడా జతచేయబడింది, Intel® Gigabit Ethernet Adapters కొరకు igb డ్రైవర్‌కు మరియు Intel 10 Gigabit PCI Express network devices కొరకు ixgbe డ్రైవర్‌కు కూడా.
డిఫరెన్షియేటెడ్ సర్వీసెస్ కోడ్ పాయింట్ (DSCP) విలువల కొరకు మద్దతును జతచేయుటతో నెట్‌ఫిల్టర్ ఫ్రేమ్‌వర్కు (నెట్వర్కు పాకెట్ ఫిల్టరింగ్ కొరకు కెర్నల్ భాద్యత వహించు భాగము) నవీకరించబడింది
bind (బెర్కెలె యింటర్నెట్ నేమ్ డొమైన్) ప్యాకేజీ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) నిభందనల అభివృద్దిని అందిస్తుంది. గతంలో, bind అనునది ధృవీకరించిన మరియు ధృవీకరించని ప్రత్యుత్తరములనుండి పొందు అభ్యర్ధనలను సులువుగా విభజించుటకు క్రియావిధానాన్ని అందించేదికాదు. అలా, సరిగా ఆకృతీకరించని సేవిక తిరస్కరించవలసిన అభ్యర్ధనలకు ప్రత్యుత్తరము యివ్వవచ్చు. ఈ నవీకరణతో, bind నవీకరించబడింది, కొత్త ఐచ్చికం allow-query-cache అందిస్తోంది అది వొక సర్వరునందలి దృవీకరించని డాటా(ఉదాహరణకు: పునరావృత ఫలితాలను మరియు రూట్ జోన్ యత్నాలను క్యాచిచేసిన)కు యాక్సెస్ నియంత్రిస్తుంది. (BZ#483708)

4. దస్త్రవ్యవస్థల నవీకరణలు

5.4 నవీకరణనందు, దస్త్రవ్యవస్థల మద్దతు కొరకు చాలా గుర్తించదగ్గ చేర్పులు చేయబడినవి. సవరించని Red Hat Enterprise Linux కెర్నల్ (BZ#457975) పైన వినియోగదారులు వారి స్వంత FUSE దస్త్రవ్యవస్థలను సంస్థాపించి మరియు నడుపుటకు, Red Hat Enterprise Linux యిప్పుడు Filesystem in Userspace (FUSE) కెర్నల్ మాడ్యూళ్ళను మరియు వినియోగదారి స్పేస్ సౌలభ్యాలను చేర్చుతుంది. XFS దస్త్రవ్యవస్థకు మద్దతుకూడా కెర్నల్ నందు సాంకేతిక పరిదృశ్యంగా జతచేయబడింది (BZ#470845). FIEMAP యిన్పుట్/అవుట్పుట్ నియంత్రణ (ioctl) యింటర్ఫేస్ అభివృద్ది పరచబడింది, దస్త్రముల యొక్క భౌతిక నమూనాను సమర్ధవంతంగా నిర్వహిస్తూ. FIEMAP ioctlను ఫలానా దస్త్రముయొక్క ఫ్రాగ్మెంటేషన్‌ను పరిశీలించుటకు అనువర్తనములచేత వుపయోగించవచ్చు లేదా అక్కడక్కడా కేటాయించివున్న ఫైలును సరిదిద్ది సృష్టించుటకు కూడా (BZ#296951).
అదనంగా, కామన్ ఇంటర్నెట్ ఫైల్ సిస్టమ్ (CIFS) కెర్నల్ నందు నవీకరించబడినది (BZ#465143). ext4 దస్త్ర వ్యవస్థ (Red Hat Enterprise Linux నందు సాంకేతిక పరిదృశ్యంగా చేర్చబడిన) కూడా నవీకరించబడింది (BZ#485315).
Red Hat Enterprise Linux 5.4 నందు, గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 (GFS2)ను వొంటరి సర్వర్ ఫైల్ సిస్టమ్ వలె (అంటే క్లస్టర్డు యెన్విరాన్మెంట్ వలె కాక) వుపయోగించుట ఆపివేయబడింది. అధిక మోతాదులో క్లస్టరింగ్ అవసరములేని GFS2 వినియోగదారులు యితర దస్త్ర వ్యవస్థలు ext3 లేదా xfs వంటి దస్త్ర వ్యవస్థలకు వలసపోవుట సమర్ధించడమైనది. xfx దస్త్ర వ్యవస్థ ప్రత్యేకించి చాలా పెద్ద దస్త్ర వ్యవస్థలను (16 TB మరియు పైని) వుద్దేశించినది. ఉన్న వినియోగదారులకు మద్దతివ్వబడుతుంది.
అవసరమైన అర్ధ విచారము సూచించే ప్రోసెస్‌ యేదైతే stat, write, stat జరుపుతుందో, అది రెండవ stat call ఫలితములనందలి దస్త్రము పైని mtime (చివరి సవరింపు సమయం)నుమొదటి stat call ఫలితములనందలి దస్త్రము పైని mtimeతో పోల్చి చూచినప్పుడు అది భిన్నంగా వుండాలి. NFS నందు దస్త్ర సమయములు ఖచ్చితంగా సేవికచేత నిర్వహించబడతాయి, కనుక WRITE NFS నిభందన ద్వారా డాటా సేవికకు బదిలీకరించునంత వరకు దస్త్రము యొక్క mtime నవీకరించబడదు. mtime నవీకరించబడుటకు డాటాను పేజీక్యాచినకు నకలుతీయుట సరిపోదు. NFS స్థానిక దస్త్ర వ్యవస్థలతో భిన్నంగా వుండుటలో యిది వొకటి. అందువలన, అధిక వ్రాత పనిభారమునందువున్న NFS దస్త్రవ్యవస్థ stat calls అధిక లేటెన్సీను కలిగివుండుటకు కారణమౌతాయి.(BZ#469848)
ext4 దస్త్రవ్యవస్థ సాంకేతిక పరిదృశ్యం నవీకరించిన యూజర్‌స్పేస్ సాధనములతో తాజా పర్చబడింది. Ext4 అనునది ext3 దస్త్ర వ్యవస్థపైన Red Hat మరియు లైనక్స్ సమూహంచేత అభివృద్ది పరచబడిన పెరుగుతున్న పురోగతి.

Note

ext4 సాంకేతిక పరిదృశ్యంలా వినియోగించిన Red Hat Enterprise Linux యొక్క గత వర్షన్లనందు, ext4 దస్త్రవ్యవస్థలు ext4devవలె లేబుల్ చేసివుండేవి. ఈ నవీకరణతో, ext4 దస్త్రవ్యవస్థలు ext4 వలె టాగ్‌చేసి వున్నవి.
samba3x మరియు ctdb అనునవి సాంకేతిక పరిదృశ్యంలా x86_64 ఫ్లాట్‌ఫాంపై అందివ్వబడినవి. Samba3x ప్యాకేజీ Samba 3.3ను అందిస్తుంది మరియు ctdb అనునది క్లస్టర్డు TDB బ్యాకెండ్ అందిస్తుంది. samba3x మరియు ctdbను క్లస్టర్ నోడ్ల సమితిపై GFS దస్త్ర వ్యవస్థతో నడుపుట క్లస్టర్డ్ CIFS దస్త్రవ్యవస్థయొక్క ఎగుమతిని అనుమతిస్తుంది. క్లైంట్ మరియు సర్వర్ సమూహాలనందు samba ప్యాకేజీనుండి సంస్థాపించిన దస్త్రములతో ఈ మూలకాలు విభేదించుచున్న కారణంగా అవి ప్రత్యామ్నాయ చైల్డ్ ఛానల్ ద్వారా అందివ్వబడతాయి

5. డెస్కుటాప్ నవీకరణలు

5.1. అడ్వాన్సుడ్ లైనక్స్ సౌండ్ ఆర్కిటెక్చర్

Red Hat Enterprise Linux 5.4 నందు, హై డెఫినిషన్ ఆడియో (HDA)కు మద్దతుకై మెరుగైన మద్దతునిస్తూ — అడ్వాన్సుడ్ లైనక్స్ సౌండ్ ఆర్కిటెక్చర్ (ALSA) నవీకరించబడింది.

5.2. గ్రాఫిక్స్ డ్రైవర్లు

ATI వీడియో పరికరముల కొరకు ati డ్రైవర్ నవీకరించబడినది.
ఇంటెల్ యింటిగ్రేటెడ్ ప్రదర్శనా పరికరముల కొరకు i810 మరియు intel డ్రైవర్లు నవీకరించబడినవి.
మాట్రాక్స్ వీడియో పరికరముల కొరకు mga డ్రైవర్ నవీకరించబడినది.
nVidia వీడియో పరికరముల కొరకు nv డ్రైవర్ నవీకరించబడింది.

5.3. లాప్‌టాప్ మద్దతు

గతంలో, CD/DVD డ్రైవులువున్న లాప్‌టాప్‌లు డాకింగ్ స్టేషనుతో డాకింగ్ మరియు ఆన్‌డాకింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవు గుర్తించబడేదికాదు. డ్రైవ్ యాక్సెస్ చేయగల్గుటకు సిస్టమ్‌ను పునఃప్రారంభించవలసి వచ్చేది. ఈ నవీకరణతో, సమస్య పరిష్కరించుటకు, ACPI డాకింగ్ డ్రైవర్లు కెర్నల్ నందు నవీకరించబడినవి. (BZ#485181).

6. సాధనముల నవీకరణలు

  • SystemTap యిప్పుడు పూర్తిగా మద్దతీయబడుతోంది, మరియు and has been సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు తిరిగివుంచబడుతుంది. ఈ నవీకరణ మెరుగుపరచిన యూజర్-స్పేస్ ప్రోబింగ్‌ను భాగస్వామ్య లైబ్రరీల ద్వారా అదిస్తుంది, మరియు ప్రయోగాత్మక DWARF అన్‌వైండింగ్‌ను, dtrace-compatible గుర్తులను అందించు కొత్త<sys/sdt.h> హెడర్ ఫైలును అందిస్తుంది.
    రీ-బేస్ అనునది debuginfo-less కొరకు మద్దతును విస్తరింపచేస్తుంది. టైప్‌కాస్టింగ్ (@cast ఆపరేటర్‌తో) యిప్పుడు మద్దతించబడుతోంది, కెర్నల్ ట్రేస్‌పాయింట్ ప్రోబింగ్‌తో సహా. debuginfo-less ఆపరేషన్లను భాదిస్తున్న చాలా 'kprobe.*' ప్రోబ్ బగ్స్ యిప్పుడు పరిష్కరించబడినవి.
    సిస్టమ్ టాప్ చాలా పత్రికీకరణ మెరుగుదలలను అదిస్తోంది. కొత్త '3stap' సౌలభ్యము వినియోగదారులకు సిస్టమ్ టాప్ ప్రోబ్స్ మరియు ప్రమేయాలపై చాలవరకు man పేజీలను అందిస్తోంది. systemtap-testsuite ప్యాకేజీ కూడా నమూనా స్క్రిప్టులయొక్క పెద్ద లైబ్రరీను అందిస్తోంది.
    సిస్టమ్ టాప్ రీ-బేస్ గురించి అధిక సమాచారము కొరకు, దయచేసి సాంకేతిక నోట్సుయొక్క సిస్టమ్ టాప్ విభాగపు ప్రాకేజీ నవీకరణల అధ్యాయము చూడండి.
  • సిస్టమ్ టాప్ ట్రేస్‌పాయింట్లు కెర్నల్ యొక్క ముఖ్యమైన విభాగములనందు వుంచబడినవి, సిస్టమ్ నిర్వాహకులనుపనితనమును విశ్లేషించుటకు అనుమతించుటకు, కోడ్ విభాజములను డీబగ్ చేయుటకు. Red Hat Enterprise Linux 5.4 నందు, ట్రేస్ పాయింట్లు కెర్నల్ వుపసిస్టమ్ యొక్క క్రింది విభాగములకు సాంకేతిక పరిదృశ్యంలా జతచేయబడినవి.
    • మెమొరీ మేనేజ్‌మెంట్ (mm) (BZ#493444)
    • బ్లాక్ డివైస్ I/O (blktrace)(Bugzilla #493454)
    • నెట్వర్కు ఫైల్ సిస్టమ్ (NFS) (BZ#499008)
    • పేజ్ క్యాచి మరియు నెట్వర్కింగ్ స్టాక్స్ (BZ#475719)
    • షెడ్యూలర్ (BZ#497414)
  • Gnu Compiler Collection version 4.4 (GCC4.4) ఈ విడుదలనందు సాంకేతిక పరిదృశ్యంలా చేర్చబడింది. ఈ కంపైలర్స సంకలనం C, C++, మరియు Fortran కంపైలర్సును వాటి లైబ్రరీలతో సహా కలిగివుంది.
  • glibc కొత్త MALLOC ప్రవర్తన: అప్‌స్ట్రీమ్ glibc అనునది యిటీవల మార్చబడింది, చాలా సాకెట్ల మరియు కోర్ల అధిక వ్యాప్తిని చేతనపరచుటకు.తంతులకు వాటి స్వంత మెమొరీ పూల్సును అనుబందించుట ద్వారాను మరియు కొన్ని సందర్భాలలో లాకింగ్ తీసివేయుట ద్వారాను యిది సంభవంచేయబడింది. మెమొరీ పూల్సునకు (ఏమైనావుంటే) వుపయోగించిన అదనపు మెమొరీ మొత్తం ఎన్విరాన్మెంట్ వేరియబుల్సు MALLOC_ARENA_TEST మరియు MALLOC_ARENA_MAX ద్వారా నియంత్రించబడతాయి.
    మెమొరీ పూల్సు యొక్క సంఖ్య ఈ విలువను చేరగానే కొర్ల సంఖ్య పరీక్ష జరుగుతుంది అని MALLOC_ARENA_TEST తెలుపుతుంది. MALLOC_ARENA_MAX గరిష్టంగా వుపయోగించు మెమొరీ పూల్సు సంఖ్యను అమర్చుతుంది, కొర్ల సంఖ్యతో సంభందంలేకుండా.
    RHEL 5.4 విడుదలనందలి glibc అప్‌స్ట్రీమ్ malloc యొక్క ఈ కార్యక్రమతను సాంకేతిక పరిదృశ్యంలా కలిగివుంది. పర్-త్రెడ్ మెమొరీ పూల్సును చేతనము చేయుటకు యెన్విరాన్మెంట్ వేరియబుల్ MALLOC_PER_THREAD యెన్విరాన్మెంటునందు అమర్చవచ్చును. ఈ కొత్త malloc ప్రవర్తన భవిష్య విడుదలలనందు అప్రమేయం కాగానే యెన్విరాన్మెంట్ వేరియబుల్ తీసివేయబడుతుంది. malloc వనరులతో యిబ్బంది యెదుర్కొంటున్న వినియోగదారులు ఈ ఐచ్చికాన్ని చేతనంచేసి ప్రయత్నించవచ్చును.

7. ఆకృతిని అనుసరించి మద్దతు

7.1. i386

  • వర్చ్యువల్ మిషన్‌ను పునః-ప్రణాళిక చేయుటవలన ఈ ఆటంకాలకు ఆలస్యం కావచ్చును, అది సమయ వ్యత్యాసములకు కారణం కావచ్చును. టైమ్-ఎలాప్సుడ్ కౌంటర్ ఆధారంగా సమయాన్ని కలిగివుండుటకు ఈ కెర్నల్ విడుదల టైమ్‌కీపింగ్ అల్గార్దెమ్‌ను పునఃఆకృతీకరించును. (Bugzilla #463573)
  • pthread_create() నందు తంతిరూపక అనువర్తనములు నిదానించబడినవి. ఇది యెంచేతంటే glibc ఆస్టాకులను కేటాయించుటకు MAP_32BIT వుపయోగించుచున్నది. MAP_32BIT వుపయోగించుట పాతబడినది కనుక, ఈ నవీకరణము నిభందిత 64-bit అనువర్తనములను తప్పించుటకు కెర్నల్‌కు కొత్త ఫ్లాగ్ (MAP_STACK mmap)ను జతపరచినది. (Bugzilla #459321)
  • TSCలను వుత్తేజపరచి deep-C స్థితులనందు నడుచునట్లు చేయు సౌలభ్య బిట్‌ను ఈ నవీకరణ చేర్చుతుంది. ఈ బిట్ NONSTOP_TSC కంజక్షన్‌నందు CONSTANT_TSCతో పనిచేస్తుంది. TSC అనునది P/T-స్థితులతో సంభందం లేకుండా స్థిరమైన తరచుదనంవద్ద నడుచునని CONSTANT_TSC సూచిస్తుంది, మరియు TSC అనునది డీప్ C-స్థితులవద్ద ఆగదని సూచిస్తుంది. (Bugzilla #474091)
  • కెర్నల్-డెవిల్ ప్యాకేజీల బుల్ట్ పైన లేదా i386, i486, i586 మరియు i686 ఆకృతుల కొరకు asm-x86_64 పీఠికలను చేర్చుటకు ఈ నవీకరణ పాచ్‌ను చేర్చుతుంది. (Bugzilla #491775)
  • i386 ఆకృతులనందు బూట్ పారామితిగా తెలుపబడిన memmap=X$Y కొత్త BIOS మాప్ తెచ్చునట్లు చూచుటకు ఈ నవీకరణ వొక పరిష్కారమును చేర్చుతుంది. (Bugzilla #464500)
  • గత కెర్నల్ విడుదలలనందు కనిపించిన ఆటంకం (NMI). ఆ సమస్య వివిధ ఇంటెల్ ప్రొసెసర్స్ పై ప్రభావం చూపించినట్లు మరియు NMI వాచ్‌డాగ్ 'స్టక్' అయినట్లు సిస్టమ్ నివేదించినట్లు అనిపిస్తోంది. NMI కోడ్‌నందలి కొత్త పారామితులు ఈ సమస్యను సరిదిద్దుతాయి. (Bugzilla #500892)
  • HP xw9400 మరియు xw9300 సిస్టమ్సు కొరకు PCI డొమైన్ మద్దతును ఈ విడుదల తిరిగి-యిస్తోంది. (Bugzilla #474891)
  • powernow-k8 మాడ్యూల్ పారామితులను /sys/modulesకు యెగుమతి చేయుటకు కార్యక్రమత సరిదిద్దబడింది. ఈ సమాచారము గతంలో ఎగుమతి కాలేదు.(Bugzilla #492010)

7.2. x86_64

  • linux-2.6-misc-utrace-update.patch నందు ఆప్టిమైజేషన్ దోషము కనుగొనబడింది. 32-bit ప్రొసెస్‌లను 64-bit మిషన్ సిస్టమ్సుపైన నడుపుతున్నప్పుడు తప్పిపోయిన (పట్టిక విస్తృతి దాటిన) సిస్టమ్ కాల్సుపై ENOSYS యివ్వదు. దీనిని సరిదిద్దుటకు ఈ కెర్నల్ విడుదల పాచ్‌ను కలిగివుంది. (Bugzilla #481682)
  • స్థిరత్వంలేని సమయ మూలముతో బూటవునట్లు కొన్ని క్లస్టర్ సిస్టమ్సు కనుగొనబడినవి. బూట్ ప్రోసెస్‌నందు TSC (టైమ్ స్టాంప్ క్లాక్) కాలిబరేట్ చేస్తున్నప్డు కెర్నల్ కోడ్ ఫ్రీ పర్ఫార్మెన్సు కౌంటర్ (PERFCTR)ను పరిశీలించకపోవుట ఇది జరుగుతోందని నిర్ధారించబడింది. బ్యుజీ PERFCTRకు అప్రమేయమై మరియు నమ్మలేని లెక్కింపులను యిస్తున్న సిస్టమ్‌నందు, కొద్ది శాతపు సందర్భాలలో, ఇది వుంటోంది.
    అప్రమేయమొందుటకు ముందుగా సిస్టమ్ ఫ్రీ PERFCTR కొరకు పరిశీలించుకొనునట్లు చేసి సరిదిద్దుటకు వొక పరిష్కారము మెరుగుపరచబడింది. (Bugzilla #467782). ఏమైనప్పటికి, ఈ పరిష్కారము, అన్ని సందర్భాలలోను సంతృప్తి పరచలేదు యెందువలనంటే, TSC లెక్కింపునకు కావలిసినప్పడు అన్నిPERFCTRలు బ్యుజీగా వుండుట సాధ్యమేగనుక. ఈ ప్రవర్తన యెదురయ్యే (1% కన్నా తక్కువ సందర్భాలలో) కెర్నల్ పానిక్ సిద్దపరచుటకు వేరొక పాచ్ చేర్చబడింది. (Bugzilla #472523).

7.3. PPC

  • సెల్ ప్రోసెసర్సు కొరకు కెర్నల్ విడుదల వివిధ పాచెస్‌ను spufs (సినర్జిటిక్ ప్రొసెసింగ్ యూనిట్స్ ఫైల్ సిస్టమ్) నవీకరించుటకు చేర్చివుంది. (Bugzilla #475620)
  • show_cpuinfo() నడుచుచున్నప్పుడు లాజికల్ PVR Power7 ప్రోసెసర్ ఆకృతిని "తెలియని" దానివలె /proc/cpuinfo జాబితా చేయునదని గుర్తించడమైనది. show_cpuinfo() అనునది Power7 ఆకృతిని Power6 వలె గుర్తించుటకు ఈ నవీకరణ వొక పాచ్‌ను జతపరుస్తుంది.(Bugzilla #486649)
  • సిస్టమ్ P ప్రోసెసర్సు వుపయోగించు మిషన్లపైన MSI-X (మెసేజ్ సిగ్నల్డ్ ఇంటరప్ట్స్) మద్దతును జతచేయుటకు/మెరుగుపరచుటకు ఈ నవీకరణ చాలా పాచ్‌లను చేర్చుతుంది. (Bugzilla #492580)
  • సెల్ బ్లేడ్స్ మిషన్లపైన గతంలో సమస్యాత్మకంగా వున్న పవర్ బటన్ కార్యశీలతను చేతనపరచుటకు ఈ విడుదలకు వొక పాచ్ జతచేయబడినది. (Bugzilla #475658)

7.4. s390

IBM సిస్టమ్ z మిషన్ల కొరకు Red Hat Enterprise Linux చాలా విస్తృతంగా కొత్త సౌలభ్యాలను అందిస్తోంది, ముఖ్యంగా:
  • నేమ్‌డ్ సేవ్‌డ్ సెగ్మెంట్స్ (NSS) వినియోగం, z/VM హైపర్విజర్ అనునది ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్‌ను భాగస్వామ్య వాస్తవ మెమొరి పేజీలనందు z/VM గెస్టు వర్చ్యువల్ మిషన్ల కొరకు అందుబాటులో వుండునట్లు చేస్తుంది. ఈ నవీకరణతో, బహుళ Red Hat Enterprise Linux గెస్టు ఆపరేటింగ్ సిస్టమ్సు NSSనుండి z/VM పైన బూట్ కాగలవు మరియు మెమొరి నందలి వొంటరి లైనక్సు కెర్నల్‌నుండి నడువగలవు. (BZ#474646)
  • కొత్త IBM సిస్టమ్ z PCI క్రిప్టోగ్రఫి యాగ్జలెరేటర్సు కొరకు ఈ నవీకరణనందు డివైస్ డ్రైవర్ మద్దతు జతచేయబడింది, ఇవే యింటర్ఫేసులను ముందలి వర్షన్లకొరకు వుపయోగించుట. (BZ#488496)
  • Red Hat Enterprise Linux 5.4 అనునది ప్రోసెసర్ తరుగుదలకు మద్దతునిస్తుంది, దీని వలన కొన్ని సందర్భాలలో ప్రోసెసర్ వేగాన్ని తగ్గించవచ్చును( అంటే సిస్టమ్ అధిక ఉష్ణోగ్రతవద్ద వున్నప్పుడు) (BZ#474664) ఈ కొత్త సౌలభ్యం, మిషన్ స్థితిని గమనించి నిర్వచిత విధానాలపై ఆధారపడి స్పందించుటకు స్వయంచాలక సాఫ్టువేరును అనుమతిస్తుంది.

    Note

    ప్రోసెసర్ తరుగుదల z990, z890 మరియు తరువాతి సిస్టమ్సునందు మద్దతీయబడింది మరియు అది SCLP సిస్టమ్ సేవా ఘటన రకము 4 ఘటనా సఫలిని 3 ద్వారా పరిశీలించబడినది. ప్రోసెసర్ యొక్క కొత్త సామర్ధ్యతను STSI ఫైలునందు నివేదిస్తుంది: /sys/devices/system/cpu/cpuN/capability.
  • కంట్రోల్ ప్రోగ్రామ్ ఐడెంటిఫికేషన్ (CPI) విశదీకృత డాటా అనునది హార్డువేర్ మేనేజ్‌మెంట్ కన్సోల్ (HMC)పైన స్వతంత్ర సిస్టమ్సును గుర్తించుటకు వుపయోగించబడుతుంది. ఈ నవీకరణతో, CPI డాటా యిప్పుడు Red Hat Enterprise Linux యిన్‌స్టాన్సుతో కలువగలదు.
  • ఫైబర్ చానల్ ప్రొటోకాల్ (FCP) పనితనపు డాటా యిప్పుడు IBM సిస్టమ్ z ప్లాట్‌ఫాంపైని Red Hat Enterprise Linux యిన్‌స్టాన్సులపై కొలవగలదు. (BZ#475334) సేకరించబడిన మరియు నివేదించబడిన ప్రమాణాలు క్రిందివాటిని కలిగివున్నాయి:
    • లైనక్సు పరికరాల స్టాక్ మూలకాలపై పనితనపు సంభందిత డాటా, స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్ (SCSI) లాజికల్ యూనిట్ నంబర్స్ (LUNs) మరియు హోస్టు బస్ ఎడాప్టర్ (HBA) నిల్వ నియంత్రణి సమాచారము.
    • ప్రతి స్టాక్ మూలకంకు: సంభందిత కొలతల యొక్క ప్రస్తుత విలువలు, వినియోగము మరియు యితర ఆపాదిత కొలతలు
    • I/O అభ్యర్ధనలు పరిమాణము, వొక్కో మూలకం లేటెన్సి మరియు మొత్తములతో కూడిన డాటా యొక్క గణాంక మొత్తములు (కనిష్టం, గరిష్టం, సగటులు మరియు హిస్టోగ్రామ్).
  • EMC సిమ్మెట్రిక్ నియంత్రణ I/Oను విడుదల చేయుటకు కెర్నల్‌కు మద్దతు జతచేయబడింది. IBM సిస్టమ్ z ప్లాట్‌ఫాంపై Red Hat Enterprise Linuxతో EMC సిమ్మెట్రిక్ నిల్వ ఎరేలను నిర్వహించుటకు ఈ నవీకరణ సామర్ధ్యతను యిస్తుంది. (BZ#461288)
  • కెర్నల్ పానిక్ మరియు డంప్ కలిగినప్పుడు తక్షణమే ఇనీషియల్ ప్రోగ్రామ్ లోడ్ (IPL)ను Red Hat Enterprise Linux వర్చ్యువల్ మిషన్‌పై జరుపుటకు కెర్నల్‌నందు కొత్త సౌలభ్యం వుంచబడింది.(BZ#474688)
  • ఆకృతీకరణ టోపాలజి సౌలభ్యతను మద్దతిచ్చే హార్డువేరు, సిస్టమ్ CPU టోపాలజి సమాచారమును ప్రణాలకికు పంపుతుంది, తద్వారా అది లోడును సమతుల్యపరిచే నిర్ణయాలు తీసుకొనునట్లు అనుమతిస్తుంది. I/O ఆటంకాలు బేసివిధానంతో పంచబడిన మిషన్లనందు, ఇతరముల కంటే అధిక I/O ఆటంకములు పొందే, సమూహపరచిన CPUలు అధిక సగటు లోటును కలిగివుంటాయి, కొన్ని సందర్భాలలో పనితనపు సమస్యలను కలుగజేస్తాయి.
    గతంలో, CPU టొపోలజి మద్దతు అప్రమేయంగా చేతనం చేయబడివుంది. ఈ నవీకరణతో, CPU టోపోలజి మద్దతు అప్రమేయంగా అచేతనం చేయబడింది, మరియు కెర్నల్ పారామితి "topology=on" అనునది ఈ సౌలభ్యం చేతనపరచుట కొరకు జతచేయబడింది. (BZ#475797)
  • parmfile ద్వారా అందివ్వబడు కెర్నల్ ఐచ్చికాలను తాత్కాలికంగా తిరిగివ్రాయుటకు అనుమతించుటకు, CMS parmfile సారమును సవరించకుండా IPL ఆదేశమును వుపయోగించి కొత్త కెర్నల్ ఐచ్చికాలను యిప్పుడు జతచేయవచ్చును. మొత్త boot ఆదేశ వరుస VM పారామితి స్ట్రింగ్‌తో పునఃస్థాపించవచ్చును, ఏదేని కెర్నల్ ఐచ్చికాలను parmfile నుండి తప్పిస్తూ. ఇంకా, వినియోగదారులు కొత్త లైనక్సు నేమ్‌డ్ సేవ్‌డ్ సిస్టమ్స్ (NSS)ను CP/CMS ఆదేశ వరుసపై సృష్టించవచ్చును. (BZ#475530)
  • IPv6 కొరకు HiperSockets Layer3 మద్దతుతొ qeth డ్రైవర్ నవీకరించబడింది. (BZ#475572) ఈ సౌలభ్యంపై యింకా వివరముల కొరకు, http://www.ibm.com/developerworks/linux/linux390/october2005_documentation.html వద్దగల IBMయొక్క "Device Drivers, Features, and Commands" పుస్తకంనందలి "qeth device driver for OSA-Express (QDIO) and HiperSockets" అధ్యాయాన్ని చూడండి.
  • z9 ప్రారంభమగు HiperSocket ఫర్మువేర్ వర్షన్ స్ట్రింగును వేరే తరహాలో తిరిగియిస్తుంది. పరికరపు ఆన్‌లైన్ అమర్పునందు యివ్వబడిన qeth స్థితి సందేశమునందలి mcl_level సమాచారము తప్పిపోవుటకు ఈ మార్పు కారణమౌతుంది. ప్రామాణిక అవుట్‌పుట్ రూపాన్ని అనుమతించుటకు, HiperSockets యొక్క కొత్త వర్షన్ స్ట్రింగ్ రూపాలను యిప్పుడు నవీకరించిన qeth డ్రైవర్ సరిగ్గా చదువుతుంది. (BZ#479881)
  • Red Hat Enterprise Linux 5.4 నందు, s390utils ప్యాకేజి వర్షన్ 1.8.1కు రీబేస్ చేయబడింది. ఈ రీబేస్ అందించునటువంటి సౌలభ్యాల పూర్తి జాబితా కొరకు, దయచేసి సాంకేతిక నోడ్సు. (BZ#477189) యొక్క ప్యాకేజీ నవీకరణల విభాగాన్ని చూడండి
  • కెర్నల్ నందు, మూసివేత ట్రిగ్గర్లకు సంభందించిన చర్యలకు sysfs యింటర్ఫేస్ అభివృద్దిచేయబడింది. ఈ సౌలభ్యముపై అధిక వివరముల కొరకు, http://www.ibm.com/developerworks/linux/linux390/development_documentation.html వద్దనున్న IBMయొక్క "Device Drivers, Features, and Commands" పుస్తకంనందలి "Shutdown actions" అధ్యాయమును పరిశీలించుము

8.1. సాధారణ కెర్నల్ సౌలభ్యపు మద్దతు

  • గతంలో, అప్‌స్ట్రీమ్ కెర్నల్ నందు ముడి పరికరముల కొరకు మద్దతు తీసివేయబడింది. ఏమైనప్పటికి, ఈ మద్దతు కెర్నల్‌కు తిరిగివుంచబడింది. అలాగే, Red Hat Enterprise Linux 5.4 నందు, ముడి పరికరములకు మద్దతుకూడా తిరిగివుంచబడింది. అదనంగా, initscripts ప్యాకేజీలు నవీకరించబడినవి, గతంలో వదిలివేసిన ముడి పరికరముల కార్యక్రమత జతచేయబడింది.(BZ#472891)
  • mmu-notifiers లేని KVM guest-smp tlb ఫ్లషింగ్ మెమొరీను పాడు చేయవచ్చు, యెలాగంటే, వేరొక vcpu పేజీలను కెర్నల్ ఫ్రీలిస్టునకు యింకా గెస్టు రీతిలో వ్రాయుచున్నప్పుడు KVM పేజీలను దానికి జతేచవచ్చును. ఈ నవీకరణ mmu-notifier మద్దతును కెర్నల్‌కు జతచేస్తుంది మరియు ముందలి పాచ్‌నందు కనుగొనిన బగ్‌ను సరిదిద్దుతుంది యిచట mm_struct అనునది వున్న డ్రైవర్సుతో పెరుగుతుంది మరియు kABI పరిశీలన వైఫల్యమునకు కారణమౌతుంది. ఉపయోగించని పాండింగ్ హోల్ నందువున్న విషయసూచికను వుపయోగించి ఈ బగ్ సరిదిద్దబడినది, ఆకృతి పరిమాణం విస్తరింపును తప్పించుటకు.(Bugzilla #485718)
  • గతంలో లైనక్సు కెర్నల్‌నందు పాయింటర్ మరియు సైన్‌డ్ అర్ధమెటిక్ వోవర్‌ఫ్లో వ్రాపింగ్ అనునది నిర్వచింపబడిలేదు. ఇది GCC (GNU C కంపైలర్) అనునది వ్రాపింగ్ అవసరములేదు అని అనుకొనుటకు కారణం కావచ్చు మరియు వోవర్ ఫ్లో పరిశీలనకొరకు కెర్నల్‌కు బహుశా అవసరమయ్యే అర్ధమెటిక్‌ను ఆప్టిమైజ్ చేయుటకు ప్రయత్నిస్తుంది. వ్రాపింగ్ ప్రవర్తనను నిర్వచించుటకు ఈ నవీకరణ -fwrapv వేరియబుల్‌ను GCC CFLAGSకు జతచేస్తుంది.(Bugzilla #491266)
  • అధిక సామర్ధ్యపు సిస్టమ్సు నందలి వొకే మెమొరీ జాగా కొరకు పోటీపడే ప్రోసెస్‌ల మధ్యని సమస్య TPC-C (ట్రాన్జాక్షన్ ప్రోసెసింగ్ కౌన్సిల్) బెంచ్‌మార్కింగ్ చేత గుర్తించబడింది. ఈ నవీకరణ అనునది fast-gup పాచెస్‌ను చేర్చుతుంది అది నేరుగా IO వుపయోగించి గుర్తించదగిన (9-10% వరకు) పనితనం మెరుగుదలను అందిస్తుంది. ఈ నవీకరణ పూర్తిగా పరీక్షించబడినది మరియు వ్యాప్తిని వృద్ది పరచుటకు 5.4 కెర్నల్‌నందు వుపయోగించబడింది. ఇంకా సమాచారము కొరకు, ఈ ప్రకరణము చూడుము. (Bugzilla #474913)
  • kupdate ప్రతిసారి అది నడిచినప్పుడు వొక్కో భ్రమణంకు అది డిస్కుకు వ్రాసే సవరణ పేజీల గరిష్ట సంఖ్యను మార్చే సౌలభ్యము సిస్టమ్ నిర్వహణాధికారులకు కలిగించుటకు, ఒక కొత్త ట్యూన్ చేయదగిన పారామితి ఈ కెర్నల్‌కు జతచేయబడింది. ఈ కొత్త ట్యూన్ చేయదగిన /proc/sys/vm/max_writeback_pages అప్రమేయంగా 1024 లేదా 4MB వుంటుంది అలా kupdate యొక్క వొక్కో భ్రమణంకు గరిష్టంగా 1024 పేజీలు వ్రాయబడతాయి. (Bugzilla #479079).యొక్క
  • కొత్త ఐచ్చికం (CONFIG_TASK_IO_ACCOUNTING=y) అనునది కెర్నల్‌కు జతచేయబడింది, వొక్కో ప్రోసెస్‌కు IO గణాంకాలను పర్యవేక్షించుటలో సహాయపడుటకు. ఉత్పత్తి యెన్విరాన్మెంట్‌నందు యిది ట్రబుల్‌షూటింగ్‌తో సహాయపడుతుంది. (Bugzilla #461636)
  • మునుపటి కెర్నల్సునందు, బ్యాక్-అప్ ప్రోసెసెస్ అనునది DB2 సేవిక భాద్యతను క్షీనింప చేస్తున్నాయి. దీనికి కారణం మాప్ చేయని పేజ్‌క్యాచీ మెమొరీ సంగం కన్నా యెక్కవగా మురికిగా వున్నప్పుడు కూడా /proc/sys/vm/dirty_ratio ప్రోసెసెస్‌ను పేజ్‌క్యాచీ మెమొరీకు వ్రాయుటనుండి నిరోధిస్తోంది (dirty_ratio 100% అమర్చినా కూడా). ఈ కెర్నల్ నవీకరణనందు చేసిన మార్పు ఈ పరిమితి చేయు ప్రవర్తనను అతిక్రమిస్తుంది. ఇప్పడు, యెప్పుడైతే dirty_ratio అనునది 100% అమర్చబడుతుందో, సిస్టమ్ పేజీక్యాచీ మెమొరీకు వ్రాయుటకు సిస్టమ్ పరిమితం కాదు. (Bugzilla #295291)
  • పరిగణించదగ్గ సిస్టమ్ లోడునందు పెద్ద రామ్‌డిస్కులను వుపయోగించుతున్నప్పుడు గత కెర్నల్‌యొక్క రామ్‌డిస్కు డ్రైవర్ నందలి rd_blocksize ఐచ్చికం డాటా కరప్షన్‌కు కారణమైంది. ఈ నవీకరణ అవసరములేని ఐచ్చికమును తీసివేసి మరియు డాటా కరప్షన్ సమస్యలను పరిష్కరిస్తుంది. (Bugzilla #480663)
  • ప్రమేయం getrusage అనునది ప్రోసెస్ యొక్క వనరు వినియోగమును పరిశీలించుటకు వుపయోగించబడుతుంది. వనరు వినియోగంనందు సమస్య విశ్లేషణకు మరియు డాటా సమీకరణకు యిది వుపయోగకరంగా వుంటుంది. ప్రోసెస్ getrusage ద్వారా విచారింపబడే సమయమందు చెల్డ్ ప్రోసెస్ తంతులు స్పానింగ్ అవుతాయి, ఏమైనప్పటికి, ఫలితాలు సరిగా వుండక పోవచ్చును యెంచేతంటే getrusage పేరెంట్ ప్రోసెస్‌ను మాత్రమే పరిశీలిస్తుంది చిల్డ్రన్‌ను కాదు. ఈ సంభవాలనందు ఖచ్చితమైన వనరు వినియోగ ఫలితాల కొరకు ఈ నవీకరణ rusadge_thread అమలుపరచింది.
  • పీఠిక /usr/include/linux/futex.h గతంలోనే C సోర్సు కోడ్ ఫైళ్ళను కంపైల్ చేయుటలో ప్రమేయం కలిగివుండేది, దోషమునకు కారణమయ్యింది. సమస్యాత్మక కెర్నల్ నిర్వచనాలను సరిదిద్దు మకియు కంపైలింగ్ దోషాలను పరిష్కరించు పాచ్‌ను ఈ నవీకరణ చేర్చినది. (Bugzilla #475790)
  • గత కెర్నల్సు నందు కెర్నల్ యిబ్బందప్పుడు లేదా oops అవుట్పుట్ సందేశములనందు కెర్నల్ వర్షన్ గుర్తించబడేది కాదు. ఈ నవీకరణ కెర్నల్ వర్షన్ వివరములను oopsనకు మరియు యిబ్బందియొక్క అవుట్పుట్‌నకు జతచేయును. (Bugzilla #484403)
  • 2.6.18 విడుదలనందు, కెర్నల్ అనునది glibc ప్యాకేజీ కొరకు కెర్నల్-పీఠికలను అందించుటకు ఆకృతీకరించబడింది. ఆ విధానము వలన వివిధ ఫైళ్ళు చేర్పిక కొరకు అసంభద్దంగా గుర్తంచబడినవి. serial_reg.h ఫైలు తప్పుగా గుర్తుంచబడింది మరియు kernel_headers rpm నందు చేర్చబడలేదు. ఇతర rpmలు నిర్మించుటలో యిది సమస్యను సృష్టిస్తోంది. ఈ నవీకరణ serial_reg.h దస్త్రమును జతచేస్తుంది మరియు సమస్యను సరిదిద్దుతుంది. (Bugzilla #463538)
  • కొన్ని సందర్భాలలో upcrund, HP Unified Parallel C (UPC) వుత్పత్తి నందలి ప్రోసెస్ నిర్వాహిక, ESRCH ఫలితాన్ని యిస్తుంది మరియు వుప-తంతి ద్వారా ఫోర్కు చేయబడిన చైల్డ్ ప్రోసెస్ కొరకు setpgid() కాల్ చేయబడినప్పుడు విఫలమైంది. ఈ సమస్యను సరిదిద్దుటకు ఈ నవీకరణ పాచ్‌ను కలిగివుంది. (Bugzilla #472433)
  • నడుస్తున్న ప్రోసెసెస్ గురించి బ్యాక్‌ట్రేస్ సమాచారమును ప్రదర్శించుటకు sysrq-tకు కార్యక్రమత జతచేయబడింది. హాంగ్ అయిన సిస్టమ్సు యొక్క డీబగ్గింగ్ నందు యిది సహాయపడుతుంది. (Bugzilla #456588)

8.1.1. డీబగ్గింగ్

Red Hat Enterprise Linux 5.4 నందు, కోర్ డంపులను వుద్బవింపచేయుట కొరకు జతచేయబడిన సౌలభ్యాలతో కెర్నల్ డీబగ్గింగ్ మెరుగుపరచబడింది. కెర్నల్ క్రాష్‌లు మరియు సిస్టమ్ డీబగ్గింగ్‌ కొరకు కోర్ డంపుల (మెమొరి స్నాప్‌షాట్‌లు) వుపయోగకరంగా వుంటాయి. ఈ నవీకరణతో, పెద్ద పేజీలను వినియోగించే సిస్టమ్సునందు కోర్ డంపు జరుపుట యిప్పుడు సాధ్యమే.(BZ#470411) అదనంగా, యిప్పుడు makedumpfile ఆదేశమును వుపయోగించి కోర్ డంప్ ఫైలు (vmcore)నుండి కెర్నల్ పానిక్ సందేశములు వెలికితీయవచ్చును. (BZ#485308)

8.1.2. రక్షణ

  • ఈ నవీకరణనందు కెర్నల్ కీ క్షేత్రముయొక్క పొడవును గత కెర్నల్సు యొక్క 32 అక్షర పొడవు సమితినుండి 255 అక్షరములకు పెంచబడింది. (Bugzilla #475145)
  • NFSD (నెట్వర్కు ఫైలు సిస్టమ్ డెమోన్) వుపయోగించి యెగుమతి చేసిన డొమైన్లనందు నాన్-రూట్ వినియోగదారులు పరికర నోడ్లు సృష్టించగలుగుతున్నారు అనే రక్షణ సమస్యను ఈ కెర్నల్ నవీకరణ గుర్తించింది. ఈ నవీకరణ CAP_MKNOD మరియు CAP_LINUX_IMMUTABLE) సామర్ధ్యాలను దస్త్ర వ్యవస్థ మాస్కు నందలి 0 యొక్క FSUIDతో వున్న వినియోగదారికి తిప్పియిస్తుంది.(Bugzilla #497272 and Bugzilla #499076)
  • ఫెడరల్ ఇన్ఫర్మెషన్ ప్రోసెసింగ్ స్టాన్డర్డైజేషన్ 140 (FIPS140) దృవీకరణపత్రం అవసరములతో వుండుటకొరకు, ఈ నవీకరణ చేర్చుతోంది:
    • ansi_cprng (Bugzilla #497891), ctr(aes) mode (Bugzilla #497888), Hmac-sha512 (Bugzilla #499463), rfc4309(ccm(aes)). (Bugzilla #472386), కొరకు స్వియ-పరిశీలన.
    • బూట్ ప్రోసెస్‌నందు GRUB చెక్‌సమ్ జరుపుటకు సంతకం ఫైలును యిచ్చే కోడు. (Bugzilla #444632)
    • మాడ్యూల్ సంతకం కొరకు DSA కీను 512 bit నుండి 1024 bitకు మార్చే కోడ్. (Bugzilla #413241)

8.2. సాధారణ ప్లాట్‌ఫాం మద్దతు

కెర్నల్ యొక్క అడ్వాన్సుడ్ కాన్ఫిగరేషన్ అండ్ పవర్ యింటర్ఫేస్ (ACPI) అమలునందు త్రోట్లింగ్ స్టేట్ (T-State) నోటీసు మద్దతు జతచేయబడింది. T-State నోటిఫికేషన్‌ను జతచేయుటవలన డాటా కేంద్రములనందు పవర్ నిర్వహణ కొరకు Intel® Intelligent Power Node Manager సాంకేతికత వుపయోగం విస్తరించబడుతుంది.(BZ#487567).

8.3. డ్రైవర్ నవీకరణలు

8.3.1. ఓపెన్ ఫాబ్రిక్స్ ఎంటర్‌ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ (OFED) డ్రైవర్సు

ఓపెన్‌ఫాబ్రిక్స్ ఎలియన్స్ ఎంటర్‌ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ (OFED) అనునది ఇన్ఫినిబాండ్ మరియు iWARP హార్డువేర్ విశ్లేషణ సౌలభ్యాముల, యిన్ఫిబాండ్ ఫాబ్రిక్ నిర్వహణ డెమోన్, ఇన్ఫిబాండ్/iWARP కెర్నల్ మాడ్యూల్ లోడర్, మరియు లైబ్రరీలు మరియు అభివృద్ది ప్యాకేజీల యొక్క సంకలనం. ఇది రిమోట్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ (RDMA) సాంకేతికతను వుపయోగించే అనువర్తనములను వ్రాయుటకు వుపయోగపడుతుంది. ఇన్ఫిబాండ్/iWARP/RDMA హార్డువేరును మద్దతిచ్చుటకు Red Hat Enterprise Linux OFED స్టాక్‌ను దాని పూర్తి స్టాక్‌వలె వుపయోగిస్తుంది.
Red Hat Enterprise Linux 5.4 నందు, ఈ క్రింది OFED భాగములు అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.4.1-rc3కు నవీకరించబడినవి
  • రిమోట్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ (RDMA) పీఠికలు (BZ#476301)
  • రిలైబుల్ డాటాగ్రామ్ సాకెట్స్ (RDS) నిభందన (BZ#477065, BZ#506907)
  • సాకెట్స్ డైరెక్ట్ ప్రొటోకాల్ (SDP) (BZ#476301)
  • SCSI RDMA ప్రొటోకాల్ (SRP) (BZ#476301)
  • IP వోవర్ ఇన్ఫిబైండ్ (IPoIB) (BZ#434779, BZ#466086, BZ#506907)
అదనంగా, క్రింది OFED డ్రైవర్లు అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.4.1-rc3కు నవీకరించబడినవి:
  • Chelsio T3 కుటుంబం నెట్వర్కు పరికరముల కొరకు cxgb3 మరియు iw_cxgb3 డ్రైవర్సు(BZ#476301, BZ#504906)
  • mthca-based InfiniBand HCA (Host Channel Adapter) కొరకు డ్రైవర్ (BZ#476301, BZ#506097)
  • qlgc_vnic డ్రైవర్ (BZ#476301)

Note

ఇంకా అభివృద్ది పొందుతున్న OFED సాంకేతికత యొక్క గరిష్ట స్థాయి లబ్ది కొరకు Red Hat దాని అప్‌స్ట్రీమ్ కోడ్ బేసును యెప్పటికప్పుడు తెలుసుకొంటుంది. అలాగా, Red Hat API/ABI సారూప్యతను మాత్రమే అప్‌స్ట్రీమ్ ప్రోజెక్టువలె చిన్న విడుదలలనందు వుంచగలదు. Red Hat Enterprise Linux అభివృద్దియొక్క జనరల్ ప్రాక్టైజ్‌నందు యిది వొక అక్షేపణ.

8.3.2. సాదారణ డ్రైవర్ నవీకరణలు

  • ఎర్రర్ డిటెక్షన్ మరియు కరెక్షన్ (EDAC) కొరకు జతచేసిన మద్దతుతో i5400 డ్రైవర్ Intel 5400 తరగతి మెమొరీ నియంత్రికల కొరకు నవీకరించబడింది. (BZ#462895)
  • i2c డ్రైవర్ iic-bus యింటర్ఫేస్ కొరకు నవీకరించబడింది, AMD SB800 కుటుంబపు వుత్పత్తులకొరకు మద్దతిచ్చుటకు.
  • Broadcom HT1100 చిప్‌సెట్ మద్దతుకొరకు i2c-piix4 డ్రైవర్ నవీకరించబడింది. (BZ#474240)
  • hpilo డ్రైవర్ నవీకరించబడింది.(BZ#488964).
  • డెవికామ్ ఈథర్నెట్ ఎడాప్టర్సు కొరకు dm9601 నవీకరించబడింది.

8.3.3. నెట్వర్కు డ్రైవర్ నవీకరణలు

  • బాండింగ్ డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడింది. ఈ నవీకరణ, ఏమైనప్పటికి సింబల్/ipv6 మాడ్యూల్ డిపెన్డెన్సీ సామర్థ్యాలను యిస్తుంది. అందుకని, గతంలో IPv6 అచేతనము చేయబడితే (install ipv6 /bin/false వరులను /etc/modprobe.conf ఫైలునందు చేర్చుటద్వారా) 5.4 నందు బాండింగ్ డ్రైవర్‌కు నవీకరణ బాండింగ్ కెర్నల్ మాడ్యూల్ లోడవ్వుటలో వైఫల్యానికి కారణమౌతుంది. మాడ్యూల్ సరిగా లోడవ్వుటకు install ipv6 /bin/false వరుస install ipv6 "disable=1తో పునఃస్థాపించాలి.
  • Intel® I/O Acceleration Technology (Intel® I/OAT) కొరకు కెర్నల్ నందలి డ్రైవర్లు వర్షన్ 2.6.24కు నవీకరించబడినాయి.(BZ#436048).
  • igb డ్రైవర్ Intel® Gigabit Ethernet Adaptersకొరకు వర్షన్ 1.3.16-k2కు నవీకరించబడింది. ఈ నవీకరణ GRO మద్దతును igb డ్రైవర్ కొరకు చేతనం చేస్తుంది.. (BZ#484102, BZ#474881, BZ#499347).
  • igbvf డ్రైవర్ నవీకరించబడింది, Intel 82576 Gigabit Ethernet Controllers కొరకు వర్చ్యువల్ మద్దతును అందిస్తుంది. (BZ#480524)
  • ixgbe డ్రైవర్ Intel 10 Gigabit PBetaCI Express నెట్వర్కు పరికరముల కొరకు వర్షన్ 2.0.8-k2కు నవీకరించబడింది. ఈ నవీకరణ GRO మద్దతును ixgbe డ్రైవర్‌ కొరకు చేతనం చేస్తుంది. (BZ#472547, BZ#499347).
  • bnx2 డ్రైవర్ Broadcom NetXtreme II network పరికరముల కొరకు వర్షన్ 1.9.3కు నవీకరించబడింది (BZ#475567 BZ#476897 BZ#489519)
  • tg3 డ్రైవర్ Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరములు కొరకు వర్షన్ 3.96కు నవీకరించబడింది.. (BZ#481715, BZ#469772). ఈ నవీకరణ 5785F మరియు 50610M పరికరముల కొరకు మద్దతును జతచేస్తుంది. (BZ#506205)
  • cnic డ్రైవర్ జతచేయబడింది, bnx2 నెట్వర్కు పరికరముల కొరకు స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ యింటర్ఫేస్ (iSCSI) మద్దతును అందిస్తుంది. (BZ#441979).
  • bnx2x డ్రైవర్ Broadcom Everest నెట్వర్కు పరికరముల కొరకువర్షన్ 1.48.105కు నవీకరించబడింది.(BZ#475481).
  • bnx2i డ్రైవర్ జతచేయబడింది, bnx2x నెట్వర్కు పరికరముల కొరకు iSCSI మద్దతును అందిస్తుంది. (BZ#441979).
  • Chelsio T3 కుటుంబపు నెట్వర్కు పరికరముల కొరకు cxgb3 డ్రైవర్ నవీకరించబడింది. iSCSI TCP ఆఫ్‌లోడ్ యింజన్సు (TOE) మరియు జనరిక్ రివ్యూ ఆఫ్‌లోడ్ (GRO) మద్దతును చేతనపరస్తుంది. (BZ#439518, BZ#499347)
  • forcedeth ఈథర్నెట్ డ్రైవర్ NVIDIA nForce పరికరముల కొరకు వర్షన్ 0.62కు నవీకరించబడింది. (BZ#479740).
  • Marvell Yukon 2 చిప్‌సెట్ వుపయోగించు sky2 డ్రైవర్ ఈథర్నెట్ నియంత్రికల కొరకు నవీకరించబడింది. (BZ#484712).
  • enic డ్రైవర్ Cisco 10G ఈథర్నెట్ పరికరముల కొరకు వర్షన్ 1.0.0.933కు నవీకరించబడింది. (BZ#484824)
  • e1000e డ్రైవర్ Intel PRO/1000 ఈథర్నెట్ పరికరముల కొరకు అప్‌స్ట్రీమ్ వర్షన్ 1.0.2-k2కు నవీకరించబడింది. (BZ#480241)
  • Emulex Tiger Shark converged నెట్వర్కుడ్ ఎడాప్టర్సు కొరకు be2net డ్రైవర్ సాంకేతిక పరిదృశ్యంలా జతచేయబడింది.

8.3.4. నిల్వ డ్రైవర్ నవీకరణలు

  • bnx2 యిప్పుడు iSCSIకు మద్దతిస్తుంది. iSCSI ఆఫ్‌లోడు మద్దతు అందించుటకు bnx2i డ్రైవర్ bnx2 డ్రైవర్‌ను cnic మాడ్యూల్ ద్వారా యాక్సిస్ చేస్తుంది. bnx2i నిర్వహించుటకు, iscsi-initiator-utils ప్యాకేజీ వుపయోగించుము. bnx2i ఆకృతీకరణపై సూచనల కొరకు, దయచేసి /usr/share/docs/iscsi-initiator-utils-<version>/README ఫైలు యొక్క విభాగము 5.1.2 చూడుము. (BZ#441979 and BZ#441979)
    ఈ విడుదలనందు చేర్చిన bnx2i వర్షన్ IPv6ను మద్దతించదని గమనించండి.
  • బిట్‌మాప్ సమ్మేళనంకు మద్దతిచ్చుటకు md డ్రైవర్ నవీకరించబడింది. డాటా ప్రతికృతిని జరుపుచున్నప్పుడు పూర్తి రీసింక్ అవసరాన్ని ఈ సౌలభ్యము తీసివేస్తుంది. (BZ#481226)
  • ఈ విడుదలనందు scsi లేయర్ ఈ క్రింది నవీకరణలను అందిస్తోంది:
    • scsi డ్రైవర్ యిప్పుడు అప్‌స్ట్రీమ్ scsi_dh_alua మాడ్యూల్‌ను చేర్చుతుంది. ఇది ఈ విడుదలతో ఎసెమ్మిట్రిక్ లాజికల్ యూనిట్ యాక్సెస్ (ALUA) మద్దతును జతచేస్తుంది. dm-multipathను వుపయోగించునప్పుడు scsi_dh_alua మాడ్యూల్ వినియోగించుటకు, aluaను hardware_handler రకములా multipah.conf నందు వుపయోగించుము. (BZ#482737)
      EMC Clariion పరికరముల కొరకు, scsi_dh_alua లేదా dm-emc వొంటరిగా వుపయోగించుట మద్దతించబడుతుంది. scsi_dh_alua మరియు dm-emc రెంటిని వుపయోగించుట మద్దతించబడదు.
    • rdac_dev_list ఆకృతి యిప్పుడు md3000 మరియు md3000i ప్రవేశాలను చేర్చుతుంది. ఇది వినియోగదారులు iscsi_dh_rdac మాడ్యూల్ ద్వారా అందించబడు ప్రయోజనాలను పొందుటకు అనుమతిస్తుంది. (BZ#487293)
    • డిస్కు ఫార్మేటింగ్ నందు iSCSI iBFT సంస్థాపనలను యిబ్బందికి గురికావుటకు కారణమగు బగ్ పరిష్కరించబడింది. (BZ#436791)
    • మల్టీపాత్‌డ్ ఎన్విరాన్మెంటుల నందు iSCSI ఫెయిల్‌వోవర్సు జరుగునప్పుడు కెర్నల్ యిబ్బందికి కారణమగు iscsi_r2t_rsp నందలి బగ్ యిప్పడు పరిష్కరించబడింది. (BZ#484455)
  • iSCSI TOE పరికరములకై మద్దతిచ్చుటకు మరియు చాల అప్‌స్ట్రీమ్ పరిష్కారాలకు ఆపాదించుటకు cxgb3 డ్రైవర్ నవీకరించబడింది. (BZ#439518)
    ఈవిడుదలనందు చేర్చబడిన cxgb3i వర్షన్‌ IPv6కు మద్దతివ్వదు.
  • ఈ విడుదల కొత్త mpt2sas డ్రైవర్‌ను చేర్చుతుంది. ఈ డ్రైవర్ LSI Logic యొక్క యెడాప్టర్సు SAS-2 కుటుంబాన్ని మద్దతిస్తుంది. SAS-2 గరిష్ట డాటా బదిలీకరణను 3Gb/s నుండి 6Gb/sకు పెంచుతుంది.
    mpt2sas డ్రైవర్ అనునది drivers/scsi/mpt2sas డైరెక్టరీనందు వుంది, drivers/message/fusion డైరెక్టరీనందు వున్న mpt డ్రైవర్లకు వ్యతిరేకంగా. (BZ#475665)
  • aacraid డ్రైవర్ యిప్పుడు వర్షన్ 1.1.5-2461కు నవీకరించబడింది. క్యూడ్ స్కాన్లు, నియంత్రణి బుట్ సమస్యలను, మరియు యితర సమస్యలను యెదుర్కొంటున్న చాలా బగ్‌లకుఈ నవీకరణ అప్‌స్ట్రీమ్ పరిష్కారములను ఆపాదించుతుంది. (BZ#475559)
  • aic7xxx డ్రైవర్ యిప్పుడు వృద్దిపరచిన గరిష్ట I/O పరిమాణమును అందిస్తుంది. మద్దతిచ్చు పరికరములు (SCSI టేప్ పరికరములు) పెద్ద బఫర్సుతో వ్రాయుటకు యిది అనుమతిస్తుంది.
  • మెమొరి ‌BAR డిస్కవరీ ప్రభావితంచేయు బగ్స్, rebuild_lun_table మరియు MSA2012 స్కాను తంతిపై అప్‌స్ట్రీమ్ పరిష్కారములు ఆపాదించుట కొరకు cciss డ్రైవర్ నవీకరించబడింది. ఈనవీకరణ ccissకు చాలా ఆకృతీకరణ మార్పులనుకూడా ఆపాదిస్తుంది.
  • fnic డ్రైవర్ వర్షన్ 1.0.0.1039కు నవీకరించబడింది. ఇది చాలా అప్‌స్ట్రీమ్ బగ్ పరిష్కారాలను ఆపాదింపచేస్తుంది, libfc మరియు fcoe మాడ్యూళ్ళను నవీకరిస్తుంది, మరియు గతికకాలమునందు డీబగ్ లాగింగ్ నియంత్రించు కొత్త మాడ్యూల్ పారామితిని జతచేస్తుంది. (BZ#484438)
  • ipr డ్రైవర్ యిప్పుడు MSI-X ఆటంకములను మద్దతిస్తుంది. (BZ#475717)
  • lpfc డ్రైవర్ వర్షన్ 8.2.0.48కు నవీకరించబడింది. ఇది యికపైవచ్చు OEM ప్రోగ్రామ్సు కొరకు హార్డువేరు మద్దతును చేతనము చేస్తుంది. అదనముగా, ఈ నవీకరణ క్రింది బగ్ పరిష్కారములను ఆపాదిస్తుంది (యితరములతో కలిపి):(BZ#476738 and BZ#509010)
    • వర్చ్యువలైజ్డు ఫైబర్-ఛానల్ స్విచ్చులు యిప్పుడు మద్దతించబడుతాయి.
    • దోష అప్రమత్తపు ఆటంకముల ఎన్నిక యిప్పుడు అందుబాటులోవుంది.
    • vport create మరియు delete loop నందు మెమొరీ లీకులకు కారణమగు బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.
    ఈ నవీకరణతో, lpfc డ్రైవర్ యిప్పుడు HBAnyware 4.1 మరియు OneConnect UCNA మద్దతిస్తుంది. (BZ#498524)
  • MPT fusion డ్రైవర్ యిప్పుడు వర్షన్ 3.04.07rh v2కు నవీకరించబడింది. ఇది చాలా బగ్ పరిష్కారములకు ఆపాదించబడుతుంది, దీనితో కలుపుకొని: (BZ#475455)
    • సిస్టమ్‌ను PAE కెర్నల్‌తో బూట్ అగుటనుండి నిరోధించే MPT fusion డ్రైవర్ బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.
    • డ్రైవర్ అన్‌లోడైనప్పుడు నియంత్రణిలు యిప్పుడు READY_STATEకు అమర్చబడతాయి.
    • ట్రాన్సుపోర్టు లేయరుకు పరికరమును జతచేయుటకు ముందుగానే mptsas డ్రైవర్ యిప్పుడు TUR (టెస్ట్ యూనిట్ రెడీ) మరియు Report LUN ఆదేశాలను జారీచేస్తోంది.
    అదనంగా, mptctl_ioctl() అనునది పెద్దసంఖ్యలో yet benign కెర్నల్ దోష సందేశాలు యిచ్చుటకు అనుకోకుండా కారణమైన పాచ్ తిప్పిపంపబడింది.ఈ విడుదలతో, mptctl_ioctl() అనునది ఈ కెర్నల్ దోష సందేశాలను జారీచేయదు.
  • megaraid_sas డ్రైవర్ యిప్పుడు వర్షన్ 4.08-RH1కు నవీకరించబడింది. ఈ నవీకరణ క్రింది అప్‌స్ట్రీమ్ పొడిగింపులను మరియు పరిష్కారములను ఆపాదిస్తుంది.(ఇతరములతో కలిపి):(BZ#475574)
    • ఈ నవీకరణ యెన్నిక రీతిని డ్రైవర్‌కు జతచేస్తుంది.
    • మద్దతిస్తున్న టేప్ డ్రైవులను ప్రభావితం చేస్తున్న బగ్ యిప్పుడు పరిష్కరించబడింది. ఈ విడుదలతో, టేప్ డ్రైవులకు పంపు ఆదేశముల కొరకు pthru సమయముగింపు విలువ యిప్పుడు O/S లేయర్ సమయముగింపు విలువునకు అమర్చబడుతుంది.
  • mvsas డ్రైవర్ యిప్పుడు వర్షన్ 0.5.4కు నవీకరించబడింది. ఇది అప్‌స్ట్రీమ్ నుండి చాలా పరిష్కారాలను మరియు పొడిగింపులను ఆపాదిస్తుంది, మరియుMarvell RAID బస్ నియంత్రణిలు MV64460, MV64461, మరియు MV64462కు మద్దతును జతచేస్తుంది. (BZ#485126)
  • qla2xxx డ్రైవర్ అనునది వర్షన్ 8.03.00.10.05.04-kకు నవీకరించబడింది, మరియు యిప్పుడు Fibre Channel over Convergence Enhanced Ethernet ఎడాప్టర్లకు మద్దతిస్తోంది. ఈ విడుదలతో, qla2xxx అనునది చాలా బగ్ పరిష్కారాలను అప్‌స్ట్రీమ్‌నుండి ఆపాదిస్తుంది,దీనితో కలుపుకొని: (BZ#471900, BZ#480204, BZ#495092, మరియు BZ#495094)
    • 4GB మరియు 8GB యెడాప్టర్లపై OVERRUN సంభాలననందు గుర్తించబడిన వ్యత్యాసములు యిప్పుడు సరిదిద్దబడినవి.
    • అన్ని vports యిప్పుడు ఏ ఎసింక్రొనస్ ఘటనలనైనా అప్రమత్త పరుస్తాయి.
    • QLogic 2472 కార్డుతో కెర్నల్ యిబ్బందులకు కారణమయ్యే బగ్ యిప్పుడు పరిష్కరించబడింది.
    • మొదటి ప్రయత్నం యొక్క ఫలితం సమయం ముగిసింది అనేది అయితే stop_firmware ఆదేశం మరలా తిరిగి ప్రయత్నించదు.
    • సెక్టార్ మాస్కు విలువ అనునది యికపై నిర్దిష్ట optrom పరిమాణముపై ఆధారపడదు.
    • మల్టీపాత్‌డ్ పరికరములనందు I/O జరుగుచున్నప్పుడు తరచూ పాత్ వైఫల్యాలకు కారణమగు బగ్ యిప్పుడు పరిష్కరించబడింది. (BZ#244967)
    • డ్రైవర్ సోర్సు కోడు అనునది యిప్పుడు KABI-కంప్లైంట్.
    • మెమొరీ ఖాళీ చేసిన తర్వాత dcbx పాయింటర్సు అనునవి యిప్పుడుNULLకు అమర్చబడుచున్నవి.
    ఈ నవీకరణలకు అదనంగా, qla2xxx డ్రైవర్ నందు చేర్చిన qla24xx మరియు qla25xx ఫర్మువేర్లు యిప్పుడు వర్షన్ 4.04.09కు నవీకరించబడినవి.
  • qla4xxx డ్రైవర్ యిప్పుడు మెరుగుపరచిన డ్రైవర్ లోపపు పునరుద్దరణను అందిస్తుంది. హోస్టు యెడాప్టర్‌పై మిగిలివున్న ఆదేశములు గుర్తించబడితే యెడాప్టర్ పునరుద్దరణను నిరోధించే డ్రైవర్‌నందలి బగ్‌ను ఈ నవీకరణ పరిష్కరిస్తుంది.(BZ#497478)
  • ఈ విడుదల కొత్త qlge డ్రైవర్‌ను చేర్చుతుంది. ఈ డ్రైవర్ QLogic FCoE 10GB యెడాప్టర్ల కొరకు ఈథర్నెట్ మద్దతును యిస్తుంది.(BZ#479288)

9. సాంకేతిక పరిదృశ్యములు

సాంకేతిక పరిదృశ్య సౌలభ్యాలు ప్రస్తుతం Red Hat Enterprise Linux సబ్‌స్క్రిప్షన్ సేవలకులోబడి మద్దతివ్వడం లేదు, క్రియారూపంగాకూడా పూర్తి కాకపోవచ్చు, మరియు సాదారణంగా వుత్పత్తి వినియోగం కొరకు సూటుకాకపోవచ్చు. ఏమైనప్పటికి, ఈ సౌలభ్యాలు వినియోగదారి వెసులుబాటు కొరకు మరియు సౌలభ్యత విశిష్టతను తెలుపుట కొరకు చేర్చడమైనది.
ఈ క్రింది సాంకేతిక పరిదృశ్యములు కొత్తవి లేదా Red Hat Enterprise Linux 5.4 beta నందు విస్తరింపచేసినవి. Red Hat Enterprise Linux 5.4 నందలి సాంకేతిక పరిదృశ్యాలపై విశదీకృత సమాచారము కొరకు, 5.4 సాంకేతిక నోట్సు యొక్క సాంకేతిక పరిదృశ్యాల విభాగాన్ని యిక్కడ http://www.redhat.com/docs/manuals/enterprise/ దర్శించండి

A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర

Revision History
Revision 0.4Thu Jul 23 2009Don Domingo
SME సాంకేతిక సమీక్ష కొరకు నిల్వ డ్రైవర్ నవీకరణల విభాగము ప్రోసెస్ చేయబడింది
Revision 0.3Thu Jul 02 2009Ryan Lerch
వివిధ టైపోలను పరిష్కరించింది, బీటా ప్రత్యేక తెలిసిన విషయములు జతచేయబడినవి.
Revision 0.2Wed Jul 01 2009Ryan Lerch
బీటా విడుదల నోట్సు.
Revision 0.1Tue Apr 21 2009Ryan Lerch
సంభందిత సారము 5.3 విడుదల నోట్సునుండి కదల్చబడింది.